AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 25 నుంచి సమ్మర్ హాలిడేస్

స్కూల్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 25 నుంచి వేసవి సెలవులను ప్రకటించింది. మంగళవారం నుంచి సమ్మర్ హాలిడేస్ స్కూల్ విద్యార్థులకు ప్రారంభం కానుండగా.. జూన్ 11 వరకు కొనసాగనున్నాయి. జూన్ 11తో సమ్మర్ సెలవులు ముగియనుండగా.. జూన్ 12న పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి 2023-24కు సంబంధించిన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ స్కూళ్లకు కూడా ప్రభుత్వం ప్రకటించిన వేసవి సెలవులు అమలు కానున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనుండగా. జూన్ 12న రీ ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే స్కూల్ విద్యార్థులకు పరీక్షలు ముగియగా.. ఈ విద్యాసంవత్సరానికి 24వ తేదీని చివరి పనిదినంగా ప్రకటించారు. సోమవారం అన్ని స్కూళ్లల్లో పేరేంట్స్ మీటింగ్స్ నిర్వహించనున్నారు.

ANN TOP 10