
అక్రమ కేసులకు భయపడం
రాజకీయంగా ఢీకొనలేకే దిగజారుడు చర్యలు
రామన్నను ఇంటికి పంపే రోజులు దగ్గరపడ్డాయి
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఫైర్
ఆదిలాబాద్: ఎన్ని ఆంక్షలు విధించినా, అక్రమ కేసులు బనాయించినా మీ తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని, మీ అవినీతి, అక్రమాలను నిరంతరం ఎండగడుతూనే ఉంటానని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అమ్మన్యూస్ డైరెక్టర్లపై కేసు నమోదు చేసి నోటీసులు పంపించడాన్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రజా సేవా భవన్ వద్ద వందలాదిగా తరలివచ్చిన అభిమానులు, అమ్మన్యూస్ వీక్షకులతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న చర్యలను దుయ్యబట్టారు.
మీడియా ముఖంగా జోగురామన్న వ్యవహారశైలిని తుర్పరబట్టారు. రాజకీయంగా తనను ఎదురించే దమ్ములేక రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేని, సాదాసీదా రైతు అయినటువంటి తన తండ్రితోపాటు తల్లిపై, తన ఆత్మీయులపై అక్రమంగా కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే, రాజకీయంగా ఢీకొట్టలేకనే జోగు రామన్న, ఆయన కుమారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇన్నాళ్లు ప్రశ్నించే గొంతుక లేకనే నీ ఆటలు సాగాయని అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించేవిధంగా కేసులు పెట్టడం నీకే చెల్లిందంటూ ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, నీ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, నిన్ను ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అమ్మన్యూస్ వీక్షకులు పలు గ్రామాల నుండి పెద్దఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. కంది శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచారు. మీ వెంట మేమున్నాంటూ మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే జోగు రామన్న కక్షపూరిత ధోరణిని ముక్తకంఠంతో ఖండిరచారు. కంది శ్రీనివాసరెడ్డి ప్రజల మనిషని, అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలగుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారన్నారు. ఇది మింగుడపడకనే ఏదో రకంగా అణదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఎమ్మెల్యే జోగు రామన్న ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ప్లకార్డులు చేతబట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అమ్మన్యూస్ నిజాలు ప్రసారం చేస్తున్నందుకే జోగు రామన్న కక్ష గట్టి దురుద్దేశ పూర్వకంగా కేసు పెట్టించారని ఆరోపించారు. అ్మన్యూస్ నిసాలు నిర్భయంగా ప్రసారం చేసే అని ఛానల్ అని ప్రశంసించారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ.రమణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గవర్గ సభ్యులు నాగర్‌కర్ శంకర్, బీజేపీ నాయకులు గిమ్మ సంతోష్‌రావు, కొడప సోనేరావు, రాజ్‌కుమార్, సంతోస్ సింగ్ ఠాకూర్, పుండ్రు రవికిరణ్, సంతోష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కిష్టారెడ్డి, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.











