AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని మోదీకి ఆత్మాహుతి బాంబు బెదిరింపు

తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆత్మాహుతి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 24, 25 తేదీలలో ప్రధాని మోదీ కేరళను సందర్శించనున్న నేపథ్యంలో ఆయనను ఆత్మాహుతి ద్వారా చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు, భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బీజేపీ కేరళ శాఖ అధ్యక్షుడు కె సురేంద్రన్‌కు పార్టీ కార్యాలయంలో ఒక అపరిచిత వ్యక్తి పంపిన బెదిరింపు లేఖ అందుకున్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రధాని మోదీ ఈ నెల 24, 25 తేదీలలో కేరళను సందర్శించనున్నారు. వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. తిరువనంతపురం నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ప్రారంభిస్తారు. వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కోచ్చిలో రోడ్‌షోలో పాల్గొంటారు. కొత్తగా ప్రారంభిస్తున్న సెమీ హైస్పీడ్ రైలులో ఆయన ప్రయాణిస్తారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ)ను నిషేధించిన తర్వాత మొదటిసారి ప్రధాని మోదీ కేరళను సందర్శించనున్న నేపథ్యంలో ఆయనకు వచ్చిన బాంబు బెదిరింపును పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10