AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ .. ఓటుకు నోటు కేసులో ప్రమాణం చేస్తారా?: డీకే అరుణ

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలు అనుకుంటున్నారని ఈటల చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని డీకే అరుణ ప్రశ్నించారు.గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు అని వ్యాఖ్యానించారు.ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి వివాదంపై ఆమె సెల్ఫీ వీడియో ద్వారా స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే అని ఎన్నో సార్లు రుజువైందని, అది ప్రజలకు ఈటల రాజేందర్ బహిరంగంగా చెప్పితే ఎందుకు ఎగిసిపడుతున్నారని నిలదీశారు. తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీనవర్గాల నాయకుడిపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బీజేపీ చూస్తూ ఊరుకోదనీ డీకే అరుణ హెచ్చరించారు.

హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం తేలిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈటల రాజేందర్ పై చేస్తున్న ఆరోపణలను అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ యేనని పేర్కొన్నారు. భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్తున్న రేవంత్ రెడ్డి, తనకు ఓటుకు నోటు కేసులో కూడా ఎటువంటి సంబంధం లేదని, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని కూడా ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు.

ANN TOP 10