దళితులను అణగదొక్కడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. యర్రగొండపాళెంను చండూరు, కారంచేడు చేయాలని చూశారని విమర్శించారు. నిన్న చంద్రబాబు దగ్గరుండి వైసీపీ కార్యకర్తలపై దాడి చేయించారన్నారు. దళిత సర్పంచ్‌తో పాటు ముగ్గురికి గాయాలయ్యాయని తెలిపారు. సభకు జనం రాకపోవడంతో గొడవలు సృష్టించారని ఆరోపించారు. తనపై చంద్రబాబు చేసిన కబ్జా ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు.









