AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాలుడి హత్య కేసులో వెలుగులోకి అసలు నిజాలు..

సనత్‌నగర్‌ 8 ఏళ్ల బాలుడి హత్య కేసులో అసలు విషయాలు బయటపడున్నాయి. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అమావాస్య రోజు ఓ హిజ్రా బాలుడిని నరబలి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. క్షుద్రపూజలు చేసినట్లు ఆధారాలు లభించడంతో బాలుడిని హిజ్రా బలి ఇచ్చిందనే వార్తలు వినిపించాయి. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక లావాదేవీలే బాలుడి హత్యకు కారణమని పోలీసులు తేల్చారు.

బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హత్యకు గల కారణాలను బయటపెట్టారు. చిట్టీల విషయంలో బాలుడి తండ్రి, హిజ్రా మధ్య గొడవలు జరిగాయని, కోపంలో బాలుడుని హత్య చేసినట్లు తెలిసింది. బాలుడిని నిందితులు కిడ్నాప్ చేసి ఇంట్లోకి తీసుకెళ్లారు. అక్కడ చంపేసిన తర్వాత బాలుడి ఎముకలు విరిచి బకెట్‌లో కుక్కారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని బకెట్‌లో తీసుకెళ్లి స్థానికంగా ఉన్న మురికి కాలువలో పడేశారు. ఈ దారుణ హత్య నగరంలో కలకలం రేపింది.

ANN TOP 10