భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వివేకా హత్య కేసులో ఊహించని విధంగా తన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. భాస్కర్ రెడ్డి అరెస్టుపై ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని.. ధైర్యంతో నిజాయితీని నిరూపించుకుంటామని తెలిపారు.సీబీఐ అధికారులు కీలక విషయాలను విస్మరిస్తున్నారని.. పాత అధికారి చేసిన విచారణే కొత్త అధికారులు అనుసరిస్తున్నారని అన్నారు. ఏప్రిల్ 3న తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కానీ అవేమి అధికారులు పరిశీలించడం లేదని తెలిపారు. వివేకా హత్యపై ముందుగా పోలీసులకు సమాచారామిచ్చిన తననే దోషిగా చూస్తున్నారని అన్నారు.తాను పోలీసులు రావొద్దన్నానని ప్రచారం చేయడం దారుణమన్నారు. వివేకా రాసిన లెటర్ అక్కడే ఉందని.. ఆ లెటర్ దాచి పెట్టమని ఆయన అల్లుడు చెప్పాడని వెల్లడించారు.వివేకా అల్లుడు లెటర్ దాచిపెట్టమనం తప్పుకాదు..సమాచారం దాచడం తప్పుకాదని.. కానీ పోలీసులకు సమాచారం ఇచ్చిన తనను తప్పుచేసిన వాడిగా చూస్తున్నారని ఆరోపించారు.
వివేకాకు షెహన్ షా అనే కుమారుడు ఉన్నాడని.. ఆస్థిని వివేకా రెండో భార్యకు ఇవ్వాలనుకున్నారని.. అందుకు సంబందించిన స్టాంప్ పేపర్లు, రౌండ్ సీల్స్ వివేకా ఇంట్లో దొరికాయన్నారు. వివేకా హత్యకు ముందు, తర్వాత స్టాంప్ పేపర్ల పరిశీలన జరిగిందని.. తర్వాత స్టాంప్ పేపర్లు పోతే సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదన్నారు. దొంగతనం దిశగా విచారణ చేయడం లేదని.. అలా చేస్తే సీబీఐ టార్గెట్ ప్రకారం విచారణ జరగదనే..స్టాంప్ పేపర్లు దొరక్కపోవడంపై విచారణ జరపడం లేదన్నారు. వాస్తవాల ఆధారంగా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వాచ్ మెన్ రంగన్న హత్య చేసిన నలుగురి పేర్లు చెప్పారని.. హత్య చేసిన దస్తగిరిని ఎలా అప్రూవర్ గా మార్చారని ప్రశ్నించారు. అప్రూవర్ ట్రయల్ మొత్తం పూర్తయ్యే వరకు జైలులోనే ఉండాలని.. కానీ సీబీఐ అప్రూవర్ కు సహరించి బెయిల్ ఇప్పించిందన్నారు.సునీత,సీబీఐ ఒకటేనని.. వారిద్దరూ ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.









