హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్.. అంబేడ్కర్ మనుమడితో కలిసి విగ్రహావిష్కరణ చేయగా.. అనంతరం అక్కడ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు ఆయుధాలతో వచ్చిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నా్రు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో వీవీఐపీలు ఉన్న సమయంలో ఓ వ్యక్తి రైఫిల్‌తో లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అతడిని లోపలికి అనుమతించలేదు.దీంతో అతడు రైఫిల్‌ను తన యజమాని కారులో ఉంచి పిస్తోల్‌తో సభలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత కారు డ్రైవర్ రైఫిల్‌తో బయటకు రావటంతో అక్కడున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ఖైరతాబాద్‌కు చెందిన దొండ్ల మధు యాదవ్ డ్రైవర్‌నని, ఆయధం మధు యాదవ్ గన్‌మెన్‌దని చెప్పడంతో, అప్పటికే సభలోకి వెళ్లిన వారిద్దరిని వెనక్కి పిలిపించి అదుపులోకి తీసుకున్నారు.









