హైదరాబాద్: నగర శివారు ప్రాంతాల్లో నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మూడు నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలను పోలీసులు సీజ్ చేశారు. నకిలీ ఐస్‌క్రీమ్ తయారుచేసి ప్రముఖ బ్రాండ్ల స్టిక్కర్లు వేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదకరమైన రసాయనలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నారు. అలాగే కాలం చెల్లిన కెమికల్స్‌ని వాడి ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నారని తెలిసింది. వివాహాది శుభకార్యాలకు నకిలీ ఐస్ క్రీములను ముఠా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తోపుడు బండ్లలో నకిలీ ఐస్‌క్రీమ్‌ని అమ్ముతున్నారు. మూడు కంపెనీలలో కోటికి పైగా ఐస్‌క్రీమ్‌ను పోలీసులు సీజ్ చేశారు. దూలపల్లి, చందానగర్, కూకట్‌పల్లిలో ఐస్‌క్రీమ్ కంపెనీలు మూసివేశారు. జీహెచ్ఎంసి, హెల్త్ డిపార్ట్మెంట్‌తో కలిసి సోదాలకు సైబరాబాద్ పోలీసులు సిద్ధపడ్డారు.









