విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్డింగ్‌లో పాల్గొననుంది. సింగరేణి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సగం వాటాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే సింగరేణి సంస్థ అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న బిడ్డింగ్‌కు సంబంధించిన వివరాలను సేకరించారు. వాటా కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చలు జరిపింది.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు కార్మిక సంఘాల నేతలతో సింగరేణి అధికారులు చర్చలు జరిపారు. దాదాపు రెండు రోజుల పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పర్యటించారు. అనంతరం అన్ని అంశాలపై సింగరేణి అధికారులు ఓ నివేదికను తయారుచేశారు. ఈ నివేదికను ఇవాళ సీఎం కేసీఆర్‌కు సింగరేణి సంస్థ అందించనుంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ప్రతి ఏడాది దాదాపు 3 లక్షల టన్నుల ఇనుము అవసరమవుతుంని, వైజాగ్ స్టీల్ నుంచి నేరుగా కొంటే లాభదాయకంగా ఉంటుందని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.









