దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. శనివారం కూడా 10వేలకు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,58,625 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,753 కేసులు బయటపడ్డాయి.
మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల (Active CAses) సంఖ్య 53,720కి చేరింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,43,22,211 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,091కి ఎగబాకింది.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.12శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.69 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 220.66 కోట్ల (220,66,25,517) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.









