AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంబేడ్కర్‌ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత




మహనీయుడి ఆశయ సాధనే లక్ష్యం కావాలి
ఎంపీ సోయం బాపూరావు,కంది శ్రీనివాస రెడ్డి పిలుపు
అంబేడ్కర్‌కు ఘన నివాళులు

ఆదిలాబాద్‌: డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రపంచానికి ఒక స్ఫూర్తి ప్రదాత అని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. అంబేద్కర్‌ 132 వ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేడ్కర్‌ దేశానికి అందించిన సేవలను నాయకులు కొనియాడారు. తాను ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నానంటే అది అంబేడ్కర్‌ మహనీయుడు పెట్టిన భిక్ష అని ఎంపీ అన్నారు. తెలంగాణా ప్రభుత్వం లో దళిత బహుజనులకు అన్ని సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు.

అందరూ ఐకమత్యంగా మెలిగి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. చదువు వల్లనే అంబేడ్కర్‌ అంత గొప్పగా కీర్తించ బడుతున్నారని, చదువు విలువను గుర్తు చేశారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి. బడుగు బలహీనవర్గాల పిల్లలందరూ బాగాచదువుకోవాలని కోరారు. దళిత బహుజనులు, వెనుక బడిన తరగతుల జీవితాలలో వెలుగులు ప్రసరించినపుడే అంబేడ్కర్‌ మహనీయునికి నిజమైన ఘన నివాళి అని కంది శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

ANN TOP 10