AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు: 13 ఏళ్లుగా కోమాలో ఉన్న యువకుడికి కారుణ్య మరణం అనుమతి

దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి, జీవచ్ఛవంలా మారిన ఓ యువకుడికి కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఢిల్లీకి చెందిన హరీష్ రాణా అనే యువకుడు 2013లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అప్పటి నుండి లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్న అతడు కోలుకునే అవకాశం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేయడంతో, అతడికి గౌరవప్రదమైన మరణాన్ని ఇవ్వాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం తీర్పునిచ్చింది.

వైద్యులు రోగిని కాపాడటం ధర్మమే అయినప్పటికీ, ఏమాత్రం కోలుకోలేని స్థితిలో చికిత్సను కొనసాగించడం నిష్ప్రయోజనమని కోర్టు వ్యాఖ్యానించింది. ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో రోగికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను తొలగించే బాధ్యతను అత్యున్నత న్యాయస్థానం అప్పగించింది. షేక్స్పియర్ నవలలోని ‘ఉండాలా? వద్దా?’ అనే పదబంధాన్ని ఉటంకిస్తూ, మానవత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు.

భారతదేశంలో కారుణ్య మరణం (Passive Euthanasia) అంశంపై 2011లో అరుణ షాన్‌బాగ్ కేసులో తొలిసారిగా చర్చ జరిగింది. ఆ కేసులో కొన్ని నిబంధనలతో కారుణ్య మరణాన్ని అనుమతించినప్పటికీ, అరుణకు మాత్రం అది వర్తించలేదు. తాజాగా హరీష్ రాణా కేసులో కోమాలో ఉన్న వ్యక్తికి నేరుగా కారుణ్య మరణాన్ని అనుమతించడం ఇదే మొదటిసారి. 13 ఏళ్లుగా కుమారుడి కోసం సర్వస్వం త్యాగం చేసిన తల్లిదండ్రుల వేదనను గుర్తించిన ధర్మాసనం, వారికి ఈ వేదన నుండి విముక్తి కల్పించింది.

ANN TOP 10