AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సినిమా పరిశ్రమకు ఏఐ ముప్పు: ‘సీడెన్స్ 2.0’ ఒక మరణ శాసనం అన్న ఆర్జీవీ

అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్ రాకతో ప్రస్తుత సినిమా ఎకోసిస్టమ్ పూర్తిగా అంతరించిపోతుందని రామ్ గోపాల్ వర్మ జోస్యం చెప్పారు. ముఖ్యంగా ‘సీడెన్స్ 2.0’ (Seedence 2.0) వంటి సాంకేతికత సినిమా ఇండస్ట్రీని ఒక ఆస్టరాయిడ్‌లా (ఉల్క) వచ్చి ఢీకొట్టబోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. వందల కోట్ల బడ్జెట్లు, వేల మంది టెక్నీషియన్లతో కూడిన భారీ సామ్రాజ్యం త్వరలోనే కూలిపోయి, కేవలం ఒక చరిత్రగా మిగిలిపోనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళి వంటి క్రియేటివ్ డైరెక్టర్లు తమ ఊహాశక్తితో అద్భుతాలు చేస్తున్నారని, అయితే దేశవ్యాప్తంగా సామాన్యుల్లో ఉన్న అపారమైన ప్రతిభకు ఇప్పటివరకు సరైన వేదిక దొరకలేదని వర్మ పేర్కొన్నారు. ‘సీడెన్స్ 2.0’ వంటి టూల్స్ వల్ల నటీనటుల డేట్స్, లైట్ బాయ్స్, భారీ సెట్టింగ్స్ అవసరం లేకుండానే.. కేవలం ఒక ‘ప్రాంప్ట్’ (ఆదేశం) ఇస్తే నిమిషాల్లో అద్భుతమైన సినిమాటిక్ విజువల్స్ తయారవుతాయని ఆయన వివరించారు. దీనివల్ల ఎవరైనా తమ ఇంట్లో కూర్చొని అంతర్జాతీయ స్థాయి సినిమాలు నిర్మించవచ్చని చెప్పారు.

ఇది సినిమా పరిశ్రమకు ఒక ‘బ్రూటల్ మర్డర్’ లాంటిదని వర్మ అభివర్ణించారు. గత వందేళ్లుగా డైనోసార్లలా రాజ్యమేలిన సినీ రంగాన్ని ఏఐ కబళిస్తుందని హెచ్చరించారు. అయితే, ఇది టాలెంట్ ఉన్న ప్రతి సామాన్యుడికి సినిమాపై దక్కే అల్టిమేట్ ప్రజాస్వామ్యం అని ఆయన స్వాగతించారు. నటుల మూడ్స్, ప్రొడక్షన్ ఖర్చులతో సంబంధం లేకుండా కేవలం ‘టాలెంట్’ మాత్రమే కీలకమయ్యే కొత్త శకం మొదలైందని ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ANN TOP 10