AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పసికందు మృతిపై కేటీఆర్ ఫైర్: పోలీసులు హంతకులకు అండగా ఉంటున్నారని ధ్వజం

నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర జాతరలో మూడు నెలల చిన్నారి మరణించిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దైవ దర్శనం కోరుకున్న పాప కుటుంబాన్ని అడ్డుకోవడమే కాకుండా, ఒక దుర్మార్గుడు కాలితో తన్నడం వల్లే ఆ పసిగుడ్డు ప్రాణాలు కోల్పోయిందని ఆయన ఆరోపించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని, వారికి అండగా నిలుస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

ఈ కేసులో పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి వస్తే, అందులో తప్పులు ఉన్నాయని చెప్పడం పోలీసుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. నిందితులపై సుమోటోగా హత్య కేసు నమోదు చేయాల్సింది పోయి, అధికార పార్టీ నాయకులకు సమాచారం అందించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. “పోలీసులకు ఉద్యోగం ఇచ్చింది రాష్ట్రం, జీతం ఇస్తోంది ప్రజలు.. కానీ వారు ఎవరి కోసం పనిచేస్తున్నారు?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

కులం, మతం, అధికారం వంటివి ఏమీ తెలియని రెండు నెలల పసిగుడ్డు ప్రాణాలు పోతే రాజ్యాంగబద్ధంగా స్పందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ ఘటనతో బిడ్డతో పాటే రాజ్యాంగాన్ని కూడా ఖననం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటి వారైనా, చివరికి వారు ముఖ్యమంత్రికి సన్నిహితులైనా సరే వదిలిపెట్టకూడదని, పసికందు మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ANN TOP 10