AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశంలో అత్యధిక రుణమాఫీచేసిన ఘనత రేవంత్ రెడ్డిదే……

  • దేశంలో అత్యధిక రుణమాఫీచేసిన ఘనత రేవంత్ రెడ్డిదే
  • రైతులకు అండగా నిలిచింది కాంగ్రెస్.. దగా చేసింది బీఆర్ఎస్
  • ముఖ్యమంత్రిపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు
  • ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధ్వజం

ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని, రుణమాఫీ చేస్తామని ఎగ్గొట్టిన చరిత్ర బీఆర్ఎస్ దని.. రెండు లక్షల రుణమాఫీ దేశంలో ఎవరూ చేయనట్లుగా అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ది అని అన్నారు. రైతుల అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రూ.20వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసి దేశంలో ఎవరూ చేయని సాహసం ముఖ్యమంత్రి చేశారని, నాడు వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారని.. ఇపుడు వరి వేస్తే సన్నవడ్లకు క్వింటాకు రూ.500బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నదన్నారు. పంటనష్టపోతే నాడు పట్టించుకున్ప పాపాన పోలేదని, ఈ ప్రభుత్వంలో పంట నష్టపోయిన వారికి కూడా పరిహారం ఇచ్చారన్నారు. సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు అందించే పథకాలు ఈ ప్రభుత్వం తిరిగి పునరుద్దరించిందన్నారు. నాడు రైతుబంధు పేరుచెప్పి అన్ని పథకాలకు రైతుకు సున్నం పెట్టిందన్నారు. నేడు రైతుభరోసాతో పాటు ప్రభుత్వం రైతుకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నదన్నారు. నాడు ఒక గడీ కట్టుకుని పరిపాలన సాగించారని, నేడు ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులందరూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమల్లో ఉన్నారని, వాస్తవంలోకి రావాలన్నారు.

ANN TOP 10