స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఇంకా ఎన్ని రోజులు రాజకీయాల కోసం వాడుకుంటారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను ‘జాతిపిత’ అని పిలుచుకోవడంపై మండిపడుతూ, అసలు జాతిపిత అని పిలుచుకోవడానికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సమాజంలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉందని, అయినా సరే ఇంకా తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని కడియం విమర్శించారు. “జాతిపిత ఎవడు.. నీ అయ్య జాగీరా?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలు ఇకపై సాగవని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మరియు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలపై కూడా కడియం సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరించడం కేసీఆర్‌కు అలవాటేనని దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కాదని, తనను తాను జాతిపితగా చిత్రీకరించుకోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.








