AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజల పాలనకు ప్రతీకగా “అడవుల మధ్య రాష్ట్ర క్యాబినెట్” సమావేశం

  • ప్రజల పాలనకు ప్రతీకగా “అడవుల మధ్య రాష్ట్ర క్యాబినెట్” సమావేశం
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాజకీయ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం
  • ప్రజల గుండెల్లోకి పాలన
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి అడవుల మధ్య రాష్ట్ర క్యాబినెట్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రా రాజకీయ చరిత్రలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో సాహసోపేతమైన, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశాలు అంటే హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌కే పరిమితమయ్యేవి. కానీ ఆ సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ, ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది….

రేపు ములుగు జిల్లా సమ్మక్క–సారలమ్మ దేవాలయం పరిసరాల్లోని హరిత హోటల్‌లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా, గిరిజన ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ అజెండాలో ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతోంది…

సమ్మక్క–సారలమ్మ దేవాలయం అనేది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు… అది గిరిజనుల ఆత్మగౌరవానికి, వారి చరిత్రకు, పోరాటాలకు ప్రతీక. అటువంటి పవిత్రమైన ప్రాంతాన్ని క్యాబినెట్ వేదికగా ఎంచుకోవడం ద్వారా, దశాబ్దాలుగా పాలనకు దూరంగా ఉన్న ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా ఈ నిర్ణయం నిలుస్తోంది….

ఈ క్యాబినెట్ సమావేశం కేవలం సమావేశం మాత్రమే కాదు…

👉 అడవుల్లోని గిరిజన జీవితాలకు ప్రభుత్వం ఇచ్చే భరోసా
👉 అభివృద్ధి నగరాలకు మాత్రమే కాదు – అడవులకు కూడా వర్తిస్తుందనే స్పష్టమైన సందేశం
👉 కాగితాలపై పాలనకు కాదు – క్షేత్రస్థాయి పాలనకు నాంది

ఈ సమావేశంలో గిరిజన సంక్షేమం, అటవీ హక్కులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక అంశాలపై చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి…..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ అడుగు ‘ప్రభుత్వం ప్రజలకు దూరంగా కాదు – ప్రజల మధ్యే ఉంటుంది’అనే కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…. ముఖ్యంగా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఏజెన్సీ ప్రాంతాలకు ఇది ఒక మలుపుగా మారనుందని పేర్కొంటున్నారు…..

సాధారణంగా అధికార గదుల్లోనే పాలన సాగుతుందనే భావనకు పూర్తి విరుద్ధంగా, అడవుల ఒడిలో, గిరిజన దేవతల సాక్షిగా జరుగుతున్న ఈ క్యాబినెట్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ పాలనా ధృక్పథాన్ని స్పష్టంగా చాటుతోంది….

ఇది కేవలం ఒక రోజు సమావేశం కాదు…
👉 ఇది గిరిజనులకు ఇచ్చిన గౌరవం
👉 ఇది పాలనకు కొత్త దారి
👉 ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం…

రాష్ట్ర ప్రభుత్వ ఈ చారిత్రాత్మక నిర్ణయంపై గిరిజన సంఘాలు, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి నాంది పలికిన చర్యగా అభివర్ణిస్తున్నాయి….

ANN TOP 10