AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రైవేట్ పాఠశాల నిర్వాకం..

ప్రశ్నార్థకంగా మారిన 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్..
గుర్తింపులేని పాఠశాల యాజమాన్యం నిర్వాకంతో ఎనిమిది మంది పదో తరగతి విద్యార్థులు మోసపోయారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఆక్స్ ఫర్డ్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు.. ఇప్పటి వరకు ఒక్క పరీక్ష కూడా రాయలేదు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమై నాలుగు రోజులైనా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదు ఆ స్కూల్ యాజమాన్యం.

అక్స్ ఫర్డ్ పాఠశాలకు కేవలం ఎనిమిదో తరగతి వరకు మాత్రమే అనుమతులు ఉండగా.. పదవ తరగతి విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పించారు. వీరి నుంచి ముక్కు పిండి మరీ పరీక్ష ఫీజులు వసూలు చేశారు. చివరికి విద్యార్థులకు హాల్ టికెట్స్ అందలేదు. పాఠశాల యాజమాన్యం చేసిన తప్పిదంతో విద్యార్థుల ఏడాది మొత్తం వృదా అయిపోయింది. అయినా ప్రత్యేక అనుమతితో పరీక్షలు రాయిస్తానంటూ ప్రిన్సిపాల్ వారిని ఇంకా బుకాయిస్తూనే ఉన్నాడు. చివరికి జరిగిన మోసాన్ని గుర్తించిన విద్యార్థులు తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులతో సహా పోలీసులను ఆశ్రయించారు.

పరీక్షలు పూర్తి అవుతున్న తరుణంలో ఇప్పుడు హాల్ టికెట్లు రావడం కష్టమే అంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఒకవేళ వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదంటున్నారు. ఒక సంవత్సరం పాటు విద్యార్థులు నష్టపోవాల్సిందే అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునే స్థాయికి దిగజారిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ANN TOP 10