AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదివాసీలకు అండగా ఉంటా



వారి సమస్యలపరిష్కారానికి నిరంతర పోరాటం
రాంజీ గోండును యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్‌: ప్రభుత్వం ఆదివాసీల సమస్యలు పరిష్కరించి, వారి హక్కులను కాపాడినప్పుడే రాంజీ గోండు కు నిజమైన నివాళి అర్పించినట్లని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు రాంజీ గోండు వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్‌ పట్టణంలోని బస్టాండ్‌ వద్ద గల ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆదివాసీలకు అండగా ఉండి,వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్‌ వారికి ఎదురు తిరిగి పోరాడిన ఆదివాసీ యోధుడు రాంజీ గోండు అని కొనియాడారు. అనేక ఆదివాసీ ఉద్యమాలకు ఆయన ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీల బతుకుల్లో మాత్రం మార్పు రాలేదన్నారు. ఆదివాసీలకు అందాల్సిన అన్ని పథకాలు వారి దరి చేరి వాళ్ల జీవితాల్లో వెలుగు నిండినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అన్నారు.ఆయన వెంట కిష్టా రెడ్డి, బండి కిష్టాన్న, లింగన్న,కదరపు దేవిదాస్‌ పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ANN TOP 10