AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసిన సర్కార్

ఫార్మా భూముల్లో ఫార్మసిటీ ఏర్పాటు చేయాలి
లేకపోతే ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలి
మూసి ప్రక్షాళన పేరిట అవినీతి
రైతులను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైడ్రాతో హల్ చల్ తప్ప మరేమీ లేదు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఇబ్రహీంపట్నం: అక్టోబర్ 20 (ఏఎన్ఎన్) ఫార్మా కంపెనీకి తీసుకున్న భూములలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలి లేదంటే ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, బొంగళూరులో బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దసరా సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే సబితాఇంద్ర రెడ్డి. కేటీఆర్ మాట్లాడుతూ… ఈ సంవత్సరం దసరా పండుగకు తెలంగాణ ఆడపడుచులకు కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేకపోయింది, రుణమాఫీ చేయలేకపోయారు, ప్రజలకు రైతు భరోసాను అందించలేని ఈ ప్రభుత్వం పనితీరు బాగాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికి నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు.

ఆనాడు ఫార్మాసిటీ కోసం భూములను సేకరిస్తే, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని మాయమాటలు చెప్పి అక్కడి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూములను వెంటనే వాళ్లకు తిరిగి ఇవ్వాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దంద చేసే పనిలో ఉన్నారని ఆయన తెలిపారు. రైతులకు వరంగల్ డిక్లరేషన్ సభలో చెప్పిన విధంగా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని లేదంటే రైతుల తరఫున మరోమారు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చడం చాలా బాధాకరమైన విషయమని, ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న వారిని అర్ధంతరంగా భయాందోళనలకు గురిచేసి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించడం సరైన పద్ధతి కాదని అన్నారు.

మూసి ప్రక్షాళన పేరుతో రేవంత్ సర్కార్ డబ్బులు కూడా పెట్టుకునే పనిలో వడ్డారని అన్నారు. హైడ్రాను తీసుకొచ్చి పేదలను మధ్యతరగతి కుటుంబాలను బతకనివ్వకుండా వారిపై జులుం చూపిస్తున్నారని తెలిపారు. చెరువులు కుంటలలో నాళాలపై అక్రమ కట్టడాలు కట్టారంటూ హైడ్రా పేరుతో హైదరాబాదులో హల్చల్ చేయడం జరుగుతుంది తప్ప మరొకటి చేసింది ఏమీ లేదని, ఇప్పటికైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని సరైన పత్రాలు ఉన్నవారిపై కొరడా జులిపించడం సరైనది కాదని అన్నారు. ఈరోజు హైడ్రా అనే ఒక భూతం చూపించి రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని దీంతో రాష్ట్రం దివాలా తీసింది అని ఆయన మండిపడ్డారు.

నేడు గ్రూప్ వన్ ఫ్రీలిమ్స్ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు నిరుద్యోగులు రోడ్లపై బైఠాయించి ధర్నాలు రాస్తారోకోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా నిరుద్యోగులపై లాఠీ జులుం చూపించడం దారుణమని అన్నారు. నిరుద్యోగులకు ఎప్పుడు మేము అండగా ఉంటామని వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చుకున్న తర్వాత కెసిఆర్ ఆధ్వర్యంలో అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, హైదరాబాదును కూడా సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసిన గణత కేసిఆర్ కే దక్కుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టడం జరుగుతుందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై విసుగు చెందారని, కెసిఆర్ మళ్ళీ రావాలంటూ తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, క్యామ మల్లేష్, మాజీ జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి పలువురు రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10