AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విపక్షాల ‎ట్రాప్‏లో పడితే నష్ట పోయేది మీరే – టీపీసీసీ చీఫ్‌

విపక్షాల ‎ట్రాప్‏లో పడొద్దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గ్రూపు 1 అభ్యర్థులను కోరారు.. జీవో నెం 29పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. జీవో నెం 29తో రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని క్లారిటీ ఇచ్చారు.

గాంధీ భవన్‎లో ఆయన   మీడియాతో మాట్లాడుతూ, ఎందరో నిపుణులతో చర్చలు జరిపిన తర్వాతే జీవో నెం 29 తీసుకువచ్చామని తెలిపారు. . జీవో నెం 29తో విద్యార్థులకు నష్టం లేదని తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానని అన్నారు.

గ్రూప్-1 విషయంలో అనవసర రాద్ధాంతం అని.. అభ్యర్థులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం విపక్షాల నేతలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై అభ్యర్థులను రెచ్చగొడుతున్నాయని సీరియస్ అయ్యారు.

ANN TOP 10