నిజాబాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఆసుపత్రిలో ఏడాది వయసున్న బాలుడు కిడ్నాపునకు గురి కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఆసుపత్రితోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను వారు పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలో బాలుడిని ముగ్గురు మహిళలు ఎత్తికెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు ఆస్పత్రి ఆవరణలో గతరాత్రి బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కి చెందిన వీరు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు పేరు మణికంఠ అని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేష¯Œ తోపాటు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపామని చెప్పారు.









