మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసును సోమవారం విచారణ చేపడతామని నాంపల్లి కోర్టు తెలిపింది. ఆరోజే కేటీఆర్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని పేర్కొంది.
బాధ్యత కలిగిన పదవిలో ఉండి మంత్రి కొండా సురేఖ తనపై నిరాధార ఆరోణలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ఈరోజు కేటీఆర్ నుంచి ఈ కేసుకు సంబంధించి స్టేట్‌మెంట్ తీసుకుంటామని చెప్పింది. కాగా శుక్రవారం కోర్టు ముందు కేటీఆర్ హాజరుకి కావాల్సి ఉండగా.. ఈ కేసుపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అదేరోజు ఈ కేసులో కేటీఆర్ స్టేట్‌మెంట్ తీసుకుంటామని కోర్టు తెలిపింది.









