మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ లో ఉద్రిక్తత నెలకొంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువు కబ్జా చేశారంటూ నిరసన తెలిపారు. అయితే, స్థానికులపై పల్లా అనుచరులు దౌర్జన్యం చేశారు.
దాడికి యత్నం చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కాలేజీ ముందు ఎలా ధర్నా చేస్తారంటూ వాగ్వాదానికి దిగారు. స్థానికులకు, పల్లా అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి.









