AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రి ఓ అద్భుతం.. ఇక్కడికి మళ్లీ వస్తా : గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ

యాదగిరిగుట్ట : యాదాద్రి అద్భుతం.. ఇక్కడికి మళ్లీ తప్పకుండా వస్తానని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసిం హస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత గవర్నర్‌కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ..ఈ ఆలయంలో నేను మంచి అనుభవాన్ని పొందాను.. మళ్లీ తప్ప కుండా వచ్చి దర్శించుకుంటానని తెలిపారు. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కాగా, గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ మంగళ, బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

ANN TOP 10