AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విప్లవాత్మక మార్పులకు ఆధ్యుడు రాజీవ్‌.. కంది శ్రీ‌నివాస రెడ్డి ఘ‌న నివాళి

అమ్మన్యూస్ ఆదిలాబాద్ :
మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్‌గాంధీ ఆనాడు దేశంలో సాంకేతిక రంగంలోఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నాయకుడని ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని త‌న క్యాంపు కార్యాల‌యం ప్రజా సేవాభ‌వ‌న్ లో రాజీవ్ గాంధీ 80వ జయంతిని పెద్ద ఎత్తున హాజ‌రైన కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌లిసి ఘ‌నంగా నిర్వహించారు.

రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారుబ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల పెన్నిధిగా వారి అభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషి చేశార‌న్నారు. ఆయ‌న హ‌యాంలోనే దేశం శాస్త్రసాంకేతిక రంగాల్లో పురోగ‌తి సాధించింద‌ని గుర్తు చేశారు. ఏనాడు ప‌ద‌వుల కోసం ప‌నిచేయ‌లేద‌ని, దేశ అభివృద్ధి కోస‌మే, బ‌ల‌హీన‌వ‌ర్గాల అభ్యున్నతి కోస‌మే నిరంత‌రం పాటుప‌డ్డార‌న్నారు. దేశంలో నూత‌న ఆవిష్కర‌ణ‌ల‌కు ప్రాణం పోసిన నాయ‌కుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.

సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌ గాంధేనని పునరుద్ఘాటించారు. దేశానికి ఆయ‌న అందించిన‌ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గిమ్మసంతోష్ , లోక ప్రవీణ్ రెడ్డి, జ‌హీర్ రంజానీ , జ‌ఫ‌ర్ అహ్మ‌ద్ ,పోరెడ్డి కిష‌న్ . సాయి చ‌ర‌ణ్ గౌడ్,ఎం. ఏ ఖ‌య్యుమ్,బండారి చిన్నయ్య,అనుముల ఉదయ్ కిరణ్, అడ్వకేట్ అఫ్రోజ్ అహ్మద్,దాసరి ఆశన్న త‌దిత‌రులు పాల్గొన్నారు.

ANN TOP 10