అమ్మన్యూస్ ఆదిలాబాద్ :
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదిలాబాద్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ శాఖ గౌరవ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అతిథిగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి తన క్యాంపు కార్యాలయానికి రావలసిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు రాత్రి ఆయన కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కంది శ్రీనివాస రెడ్డి షబ్బీర్ అలీకి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించారు. మంత్రిగా ప్రజా ప్రతినిధిగా , సీనియర్ కాంగ్రెస్ నేతగా రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను కంది శ్రీనివాస రెడ్డి కొనియాడారు.

అంత గొప్ప మనిషి తన ఆహ్వానాన్ని మన్నించి క్యాంపు కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందని విచ్చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇక షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎన్ ఆర్ ఐ కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు ఆఫీస్ హైటెక్ రీతిలో ఉందని పొగిడారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు. గతంలో తాను ఆదిలాబాద్ వచ్చినప్పుడు కాంగ్రెస్ శ్రేణులను నాయకులను కలవడానికి రెండు మూడు చోట్లకు వెళ్లవలసి వచ్చేదని ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని యువ నాయకుడు కంది శ్రీనివాస రెడ్డి అన్ని గ్రూపులను ఒకే గొడుగు కిందకు తెచ్చారని ఇప్పుడు అందరినీ ఒకే చోట కలిసే అవకాశం ఏర్పడిందన్నారు.
అంతేకాక కందిశ్రీనివాస రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంతో పటిష్టంగా తయారవుతుందన్నారు.తనకు ఆదిలాబాద్ తో ఎంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల సంక్షేమం కోసం తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు. ఆదిలాబాద్ కు చెందిన ఆయా వర్గాల వారు అభివృద్ధి ఫండ్స్ కోసం కంది శ్రీనివాస రెడ్డిని సంప్రదిస్తే తన దృష్టికి తెస్తారని తాను సీయం దృష్టికి తీసుకెళ్లి కావలసిన నిధుల మంజూరులో తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గిమ్మసంతోష్ , జహీర్ రంజానీ , అర్చన రామ్ కుమార్ , జాంటీ ,దుర్గం శేఖర్ ,డేరా కృష్ణారెడ్డి , ఎం ఏ షకీల్ , ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు









