కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో బస
ఉదయం జెండా ఊపి యాత్రను ప్రారభించిన కంది శ్రీనివాస రెడ్డి
అమ్మన్యూస్ ఆదిలాబాద్ : ముప్ఫై రెండేళ్లుగా ప్రతీ సంవత్సరం కొనసాగుతున్న 33వ రాజీవ్ సద్భావన యాత్ర ఆదిలాబాద్ కు చేరుకుంది.ఆగష్టు 9న పెరంబుదూర్ లో మొదలైన యాత్ర ఈనెల 20న న్యూఢిల్లీలోని రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమి కి చేరుకుంటుంది.ఆదిలాబాద్ పట్ణణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి యాత్రికులు బస చేసారు. ఉదయం క్యాంపు ఆఫీస్ ఆవరణలో జెండా ఊపి యాత్రను ప్రారంభించి యాత్రికులకు వీడ్కోలు పలికారు.









