AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘పంజా’ విసిరిన బెంగళూరు.. డూ ఆర్ డై మ్యాచ్ లో ఘన విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

వరుసగా 6 ఓటములతో ఢీలా పడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ లీగ్ లో అద్భుతంగా పునరాగమనం చేసింది. ధర్మశాల వేదికగా గురువారం (మే 09) జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. తద్వారా ఈ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ప్లేఆఫ్ కలను సజీవంగా ఉంచుకుంది. ఆర్‌సీబీ చేతిలో ఓడిన పంజాబ్ ప్లేఆఫ్ రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించింది. పంజాబ్ 12 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచింది. కానీ RCB 12 మ్యాచ్‌ల్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. జట్టు తరఫున విరాట్ కోహ్లి 92 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రజత్ పాటిడర్ 55 పరుగులు, కామెరాన్ గ్రీన్ 46 పరుగులు చేశారు. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి పంజాబ్ 17 ఓవర్లలో 181 పరుగులు అలౌట్ అయ్యింది. శశాంక్‌ (37), బెయిర్‌ స్టో (27), సామ్‌ కరన్‌ (22) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో కర్ణ్‌ శర్మ 2, స్వప్నిల్‌ సింగ్‌ 2, ఫెర్గూసన్‌ 2, సిరాజ్‌ 3 వికెట్లు తీశారు.

కాగా బెంగళూరు తర్వాతి రెండు మ్యాచ్‌లు ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్నాయి. ఈ రెండు జట్లూ ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో టాప్ -2 లో ఉన్న ఇరు జట్లకు 16 పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు 14 పాయింట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో ఉంది. కాబట్టి రెండు జట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగళూరు రెండు మ్యాచ్‌లు గెలిస్తే 14 పాయింట్లు, ప్లేఆఫ్‌ల లెక్క తేల్చవచ్చు.

ANN TOP 10