ఈ పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేశారో చెప్పడానికి ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు విమర్శించారు. బుధవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 25 లక్షల మందిని పైకి తీసుకొచ్చామని మోడీ అంటున్నారని, అదే నిజమైతే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు అని నిలదీశారు. మరోసారి మోడీ వస్తే అదానీ, అంబానీలను కోటీశ్వరులు చేస్తాడు తప్ప.. పేదలకు ఏమీ చేయరని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కులగణన చేపడతాం అంటున్నారని, దేశం సమిష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం వేతనం 400 రూపాయలకు పెంచుతామన్నారు. ఆంధ్రలో ఇమామ్‌లకు రూ. 5 వేల పెన్షన్ అంటున్నారని, ఇక్కడున్న వాళ్ళు ముస్లింలు కాదా అని ప్రశ్నించారు. బీజేపీ మీడియా పబ్లిసిటీ కోసం అసత్య ప్రచారం వీహెచ్ హనుమంతరావు చేసుకుంటోందన్నారు.









