AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది కాషాయం పార్టీ. ఆ స్థానం నుంచి ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును ప్రకటించగా.. అధికార కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న పేరును ఖరారు చేసింది. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ తెర వీడింది. గతసారి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి బరిలో నిలిచారు. ప్రేమేందర్ రెడ్డి మరోసారి అవకాశం ఇస్తుందని ప్రచారం కూడా జరిగిన తరుణంలోనే చివరికి అయననే ఫిక్స్ చేసింది. ఇక మే 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అలాగే జూన్ 5న ఓట్లు లెక్కించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

ANN TOP 10