AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వేముల‌వాడ శ్రీరాజ‌రాజేశ్వ‌రస్వామి ఆల‌యంలో ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేక పూజ‌లు

వేములవాడలో కోడె మొక్కులు తీర్చుకున్న ప్రధాని మోదీ
ప్ర‌ధానికి ప్ర‌త్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాల‌ను అంద‌జేసిన వేద పండితులు

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బుధ‌వారం తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధాని మోదీ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా బుధ‌వారం ఉద‌యం క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని వేముల‌వాడ శ్రీరాజ‌రాజేశ్వ‌రస్వామి ఆల‌యంలో ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేకంగా నిలిచే కోడె మొక్కుల‌ను ప్ర‌ధాని తీర్చుకున్నారు. అనంత‌రం ప్ర‌ధానిని వేద పండితులు ప్ర‌త్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాల‌ను అంద‌జేశారు. అంత‌కుముందు ఆయ‌న‌ను ఆల‌య అధికారులు, అర్చ‌కులు ప్ర‌త్యేక మెమొంటో, శాలువాతో సత్కరించారు.

ANN TOP 10