రోజుకు 20 గ్రామాలలో ప్రచారం
45 డిగ్రీల ఎండ వేడిమిలోను ప్రచార హోరు
ఇవాళ జైనథ్ మండలంలోని గ్రామాలలో రోడ్ షో
అందరి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం -కంది
చేతిగుర్తు కే మన ఓటు-కెఎస్ ఆర్
ఆత్రం సుగుణక్క భారీ మెజారిటీతో గెలిపిద్దాం -కెఎస్ ఆర్
అమ్మన్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ : రాముడు అందరివాడని కేవలం బీజేపీ కి మాత్రమే దేవుడు కాదని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. రాముడిని మొక్కుతం ఎన్నికల్లో బీజేపీని తొక్కుతమని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని అసెంబ్లీ ఇంఛార్జి గా తన భుజాలపై వేసుకుని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఇప్పటికే దాదాపు నియోజకవర్గమంతా చుట్టివచ్చిన ఆయన ఇవాళ జైనథ్ మండలంలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా ఆయన దూసుకు పోతున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నభోజన సమయం వరకు 13 ఊర్లు అనంతరం రాత్రి ప్రచార సమయం ముగిసే వరకు 11 గ్రామాలలో మొత్తం రోజుకు 24 గ్రామాలలో ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు.జైనథ్ మండలం భోరజ్,సిర్సన్న,గూడ, రాంపూర్ ,గిమ్మ, ఆకోలి,కేదార్ పూర్ ,కొరటా,పూసాయి,పిప్పర్ వాడ, మాండగడ,కామాయి,డొల్హారా లలో ప్రచారం అనంతరం భోజన విరామం తీసుకుని తిరిగి ఫౌజ్ పూర్ , తరోడ,హసీంపూర్,నిరాల,బాలాపూర్ ,ఆకుర్ల ,సావాపూర్,లేఖర్ వాడ, పెండల్ వాడ,సాంగ్వి,కౌట గ్రామాలలో రాత్రి వరకు ప్రచారం నిర్వహించనున్నారు.ప్రతీ గ్రామంలో ఆయనకు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ,ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మేము మీ వెంటే అంటూ మీ నాయకత్వంలో సని చేస్తామంటూ ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు కంది శ్రీనివాస రెడ్డి .

ఇద్దరి మధ్యే పోటీ -కెఎస్ ఆర్
ఈ ఎన్నికలలో ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ ల మధ్యే ఉండనుందని బీఆర్ఎస్ ఇక్కడ బలహీనమైందని ఆపార్టీకి ఓటేసి మీ ఓటు వృధా చేసుకోవద్దని కంది శ్రీనివాస రెడ్డి ప్రజలను కోరారు. ఇక బీజేపీ కి ఓటేస్తే రిజర్వేషన్లు ప్రశ్నార్ధకమయ్యే అవకాశముందని తాము గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తామంటున్న బీజేపికి ఓటేయొద్దని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని గతం లో అధికారంలో ఉన్నప్పుడు భూములిచ్చిందని ,ఇంటి జాగాలిచ్చిందని , ఇండ్లించ్చిందని ప్రజలను కడుపులో పెట్టుకొని పరిపాలించిందని గుర్తు చేసారు. ప్రస్తుతం ప్రజల విశ్వాన్ని పొందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉందని దేశమంతా కాంగ్రెస్ ను ఆదరించి కేంద్రంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు ఓట్లేసి గెలిపించాలని ఆయన పిలుపు నిచ్చారు.ఇక్కడ ఆదిలాబాద్ లో పార్టీ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణ ఒక పేదింటి ఆడబిడ్డ అని మంచిగా చదువుకొని ప్రజా సేవ చేసేందకు తన ఉపాధ్యాయ వృత్తి కి రాజీనామా చేసి వచ్చిందని అందుకే ఆమెను గెలిపిస్తే తోటి ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని వాటిని తీర్చేందుకు కృషి చేస్తుందని అన్నారు. చేతి గుర్తు కు ఓటేసి సుగుణక్కను పార్లమెంట్ కు పంపిస్తే మన కోసం అక్కడ తన గళాన్ని వినిపిస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ అభివృద్ధి మీ చేతుల్లో ఉందని మీరందరు సుగుణక్కను ఓట్లతో దీవిస్తే మనకంతా మంచే జరుగుతుందన్నారు.









