ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. సోమవారం కవిత బెయిల్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే ఆమె వేసిన పిటిషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. రేపటితో కవిత జ్యడిషియల్ కస్టడీ ముగియనుంది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడానికి ఇంకా ఒకరోజు గడువు ఉన్నప్పటికీ- బెయిల్ పిటీషన్లపై విచారణ కొనసాగుతున్నందున ఒకరోజు ముందే బెయిల్ పిటీషన్లపై తీర్పు వెలువరించింది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు రోస్ అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తీర్పు ఇచ్చారు. ఫలితంగా జ్యుడీషియల్ కస్టడీ ముగిసేంత వరకూ ఆమె సీబీఐ, ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది. దాదాపు నలభై రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు.
*కోర్టు దృష్టికి కవిత పలు విషయాలు..*
అయితే బెయిల్ పిటిషన్ సందర్భంగా కవిత కోర్టు దృష్టికి పలు కీలక విషయాలను తీసుకెళ్లారు. పార్టీ స్టార్ క్యాపెంయినర్‌గా ఉన్నందున ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని తెలిపింది. మహిళా నేతగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ అర్హత ఉందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను అరెస్ట్ కవిత తరుపు న్యాయవాది పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని కవిత కోర్టులో తెలిపారు. అరెస్ట్ కి సరైన కారణాలు లేవని కవిత వాదనలు వినిపించారు. మరోవైపు ఈడీ, సీబీఐ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోరాయి. దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపాయి. మద్యం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ తెలిపింది. మద్యం కేసులో సూత్రధారి, కీలక పాత్రధారి కవిత అని ఈడీ సైతం తెలిపింది.
*బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే ఛాన్స్..*
తొలుత మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కవితను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను పది రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. తర్వాత కవితను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసిన కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇరువర్గాల వాదనలు ముగిశాయి. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని సీబీఐ, ఈడీ అధికారులు వాదించారు. సౌత్ లాబీ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి అందించారని సీబీఐ, ఈడీ వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. నేడు తీర్పు వెలువరించింది.









