AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ నేత మధుయాష్కీకి తప్పిన ప్రమాదం..

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆలేరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ద్విచక్రవాహనదారులు అడ్డురాగా.. వారిని తప్పించే క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ వెళ్లిన మధుయాష్కీ తిరుగు ప్రయాణంలో ఆలేరు వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. ద్విచక్రహనాలను తప్పించబోయి.. రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

తన డ్రైవర్ ముఖేష్ అప్రమత్తత వల్లే ప్రమాదం తప్పిందని మధుయాష్కీ ట్వీట్ చేశారు. ‘ఆలేరు సమీపంలో నా కారు ప్రమాదానికి గురైంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని రక్షిచే క్రమంలో నా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. భగవంతుని దయ వల్ల ఎవరికీ పెద్దగా నష్టం జరగలేదు. డ్రైవర్ ముఖేష్ తెలివిగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది.’ అని మధుయాష్కీ ట్వీట్ చేశారు.

ANN TOP 10