బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే సంక్షేమం
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు దండ వేయని వాళ్లు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారా అని బీఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను కుదించాలన్న ఆలోచనలతో రోజుకో ప్రకటన చేస్తోందని రేగా అన్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలు యథాతథంగా కొనసాగాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. ఆదివారం గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టి తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేశారన్నారు. మరోసారి ప్రజలను మోసం చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై, సంక్షేమంపై చిత్తశుద్ధి లేదన్నారు. నిత్యం ఇతరులపై నిందిస్తూ పబ్బం గడుపుతున్నాయన్నారు. 6 గ్యారంటీ అమలు లో చిత్తశుద్ధి లోపించింది అన్నారు. సంక్షేమ పథకాలు ఆరు నెలలు కావస్తున్నా అమలు చేయడం లేదన్నారు. పెన్షన్లు, కల్యాణ లక్ష్మి అమలు కావడం లేదని, వైద్యానికి అందించే సీఎంఆర్ఎఫ్ కూడా నిలిపివేశారన్నారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేసి గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకొని ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ చేకూర్చి గెలిపించాలని కోరారు. సంక్షేమం బీఆర్ఎస్ వల్లనే సాధ్యమవుతుందని. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు. కోలేటి భవాని శంకర్. వట్టం రాంబాబు. తెల్లం భాస్కర్. తిరకవల్లురి రామ్మూర్తి. గడ్డం వీరన్న. గడ్డం రమేష్. నిట్ట రాములు, తాటి కృష్ణ, లక్ష్మీనారాయణ, రాంబాబు, సుధాకర్, ప్రభాకర్, సుధాకర్, మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.









