AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాసేపట్లో కాగజ్‌నగర్‌లో అమిత్ షా బహిరంగ సభ

ఆదిలాబాద్ జిల్లా: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కాగజ్‌నగర్‌లో జరగనున్న బీజేపీ (BJP) వికాస సంకల్ప సభ లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొని ప్రసంగిస్తారు. కాగా ఈ బహిరంగ సభకు జిల్లాలోని పార్టీ నాయకులు, ప్రజలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి అలిజాపూర్‌ శ్రీనివాస్‌ పిలుపు నిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆపార్టీ రాష్ట్ర నాయకులు బోనగిరి సతీష్‌బాబు, జడ్పీటీసీ అరిగెల నాగే శ్వరరావు, బీజేపీ జిల్లా కోకన్వీనర్‌ మయూర్‌ చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి అధినాథ్‌, రాష్ట్ర మహిళామోర్చా నాయకురాలు సిద్దంశెట్టి సుహాసినితో కలిసి శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ANN TOP 10