అల్లుఅర్జున్ బీఎండబ్ల్యూ రిజిస్ట్రేషన్ బీఎండబ్ల్యూ i 7 లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా హీరో అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం విచ్చేశారు. సుమారు 2.26 కోట్ల విలువ జేసే ఈ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అల్లు అర్జున్ డిజిటల్ సంతకం చేశారు.
అనంతరం ఆ కారుకు 6664 నెంబర్‌ను అధికారులు కేటాయించారు. కాగా, ‘పుష్ప’ సినిమా హెయిర్ స్టైల్‌లో అల్లు అర్జున్ సందడి చేశారు. అభిమానులు సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు.









