AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు నుమాయిష్ పొడిగింపు

హైద‌రాబాదీల‌కు నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు నుమాయిష్‌ను పొడిగిస్తున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 15తో నుమాయిష్ ముగియ‌నుంది. కానీ 3 రోజులు అద‌నంగా పొడిగిస్తున్న‌ట్లు ఎగ్జిబిష‌న్ సొసైటీ ప్ర‌క‌టించింది. నుమాయిష్ గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంది. నిన్న నుమాయిష్‌కు భారీ సంఖ్య‌లో జ‌నాలు త‌ర‌లివ‌చ్చారు. ఇక ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీన నుమాయిష్ ప్రారంభ‌మై ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన ముగుస్తుంది.

ANN TOP 10