AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ధ్రువ్ రాఠీపై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై ఢిల్లీ కోర్టు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. బీజేపీకి మద్దతుగా ఉన్న ‘ఐ సపోర్ట్ నరేంద్ర మోదీ’ ఫేస్‌బుక్ పేజీ వ్యవస్థాపకుడు వికాస్ పాండే దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన అనంతరం సాకేత్ కోర్టు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనమ్ రయీస్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం జర్మనీలో ఉంటున్న ధ్రువ్ రాఠీకి గతంలో కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అంతేకాకుండా రెండుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన కోర్టుకు హాజరుకాలేకపోయారు.

ధ్రువ్ రాఠీకి వారెంట్లు అందజేయడంలో ఎదురైన ఇబ్బందులు, కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో తాజాగా మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

ANN TOP 10