AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 12 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీజోన్‌-2 ఐజీగా రాచకొండ సీపీ సుదీర్‌బాబును బదిలీ చేసింది. ఆయన ఇటీవల రాచకొండ సీపీగా వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే ఆయనకు మల్టీజోన్‌-1 పూర్తిస్థాయి అదనపు ఐజీగానూ బాధ్యతలు ఆయన ఇచ్చింది. రాచకొండ సీపీగా తరుణ్‌జోషికి బాధ్యతలు అప్పగించింది.

రామగుండం సీపీగా శ్రీనివాసులు, జోగులాంబ జోన్‌ డీఐజీగా ఎల్‌ఎస్‌ చౌహాన్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా జోయల్‌ డేవిస్‌, సీఐడీ డీఐజీగా నారాయణ్‌ నాయక్‌, టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా కే అపూర్వ రావ్‌, సౌత్‌వెస్ట్‌ జోన్‌ డీసీపీగా డీ ఉదయ్‌కుమార్‌, ఈస్ట్‌జోన్‌ డీసీపీగా ఆర్‌ గిరిధర్‌ నియామకమయ్యారు. ఆర్‌బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డెప్యూటీ డైరెక్టర్‌గా డీ మురళీధర్‌, టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధన రశ్మి పెరుమాల్‌ను బదిలీ చేసింది. బీ నవీన్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది.

ANN TOP 10