AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముప్పు.. బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొనుగోలు చేస్తున్నా: రాబర్ట్ కియోసాకి

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రముఖ పెట్టుబడిదారుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తూ తాను బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియంలలో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈటీఎఫ్‌ల ద్వారా కాకుండా నేరుగా ఈ ఆస్తులను కొనుగోలు చేస్తున్నానని తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్, ప్రభుత్వ ఆర్థిక విధానాలు, పెరుగుతున్న అప్పుల కారణంగా భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రతి 90 రోజులకు అమెరికా ఒక ట్రిలియన్ డాలర్లను ముద్రిస్తోందని కియోసాకి పేర్కొన్నారు. డెరివేటివ్స్ మార్కెట్‌లో పేరుకుపోతున్న భారీ ఆర్థిక లావాదేవీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారవచ్చని హెచ్చరించారు. 2008లో సబ్‌ప్రైమ్ మార్ట్‌గేజ్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎదురుకాబోయే ఆర్థిక పతనం 2008 సంక్షోభం కంటే పెద్దదిగా ఉండవచ్చని, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

అమెరికా అప్పులు పెరుగుతుండటంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియంతో పాటు రియల్ ఎస్టేట్, చమురులోనూ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. 2002లోనే తన ‘రిచ్ డాడ్స్ ప్రొఫెసీ’ పుస్తకంలో ఇలాంటి ఆర్థిక పరిణామాలపై హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అయితే ఇవన్నీ కియోసాకి వ్యక్తిగత అంచనాలు మాత్రమేనని, భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం తప్పనిసరిగా వస్తుందని భావించకూడదు.

ANN TOP 10