AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.

కాగా, వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం గమనార్హం. ఇరువురి మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.. కృష్ణా జలాల అంశంపైన కూడా చర్చించినట్లు బావిస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల హడావుడి ప్రారంభమైన వేళ వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది

ANN TOP 10