షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశాల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ భారత్కు వచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ మంత్రి భారత్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత్తో ద్వైపాక్షిక చర్చలు జరపడానికి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు.
ఉగ్రవాదం, సింధు జలాల ఒప్పందం వంటి కీలక అంశాలపై మీడియా ప్రశ్నించగా, అధికారికంగా చర్చలకు ఆహ్వానిస్తేనే సమాధానాలు ఇస్తానని మాలిక్ పేర్కొన్నారు. ఎస్సీఓ సమావేశాల్లో వెల్లడైన సందేశాన్ని పాకిస్తాన్కు తీసుకెళ్లడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉగ్రవాద సమస్యపై ప్రశ్నలకు స్పందిస్తూ.. ఆధారాలతో కూడిన అధికారిక చర్చల వ్యవస్థ ద్వారా ఈ అంశాన్ని చర్చించుకోవచ్చని అన్నారు. ఉగ్రవాదం కారణంగా అనేక దేశాలు నష్టపోయాయని, పాకిస్తాన్ కూడా ఎంతోమంది ప్రజలను కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఇరు దేశాలు చర్చలు జరపాలని అభిప్రాయపడ్డారు.








