AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బిగ్‌బాస్ విజేత పల్లవి ప్ర‌శాంత్‌కు బిగ్ షాక్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ను బుధవారం రాత్రి పోలీసులు మెజిస్టేట్ ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో అతనికి 14రోజుల రిమాండ్ విధించారు. బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను బుధవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సిద్ధిపేట గజ్వేల్ మండలం కొల్లూరులో అతని నివాసం వద్ద జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి ఆరు గంటలపాటు విచారించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమంటూ పోలీసులు హెచ్చరించారు. బుధవారం రాత్రి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని జడ్జి ఇంట్లో హాజరుపర్చారు. ఈ క్రమంలో న్యాయమూర్తి పల్లవి ప్రశాంత్ కు 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం చంచల్ గూడ జైలుకు ప్రశాంత్ ను పోలీసులు తరలించారు. ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడికి రిమాండ్ విధించారు.

ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘటనపై పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తదితరులపై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, అతని కారు డ్రైవర్లు సాయి కిరణ్, రాజులను అరెస్టు చేశామని అన్నారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహావీరాన్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రశాంత్ ను మెజిస్టేట్ ముందు హాజరుపర్చగా.. 14రోజులు రిమాండ్ విధించడం జరిగిందని తెలిపారు. ఈ కేసుపై విచారణ జరుగుతుందని తెలిపారు.

ఇదిలాఉంటే.. కప్ తీసుకున్న తరువాత పోలీసుల సూచనల మేరకు చాలాసేపు బిగ్ బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంచింది. ఆ తరువాత ఆయన్ను గేటు వెనుక నుంచి బయటకు పంపించేశారు. కానీ, ప్రశాంత్ మాత్రం మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తన కారులో వచ్చాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఆయనకోసం ఎదరుచూస్తున్న అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన వెంట వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుచెప్పడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసంను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రశాంత్ తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. బుధవారం రాత్రి ప్రశాంత్ తో పాటు పలువురిని అరెస్టు చేశారు.

ANN TOP 10