ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఓ తండ్రి అల్లుడి నుంచి కూతురు విడిపోవడాన్ని వేడుకలాగా ఘనంగా జరిపాడు. స్థానిక ప్రాంతానికి చెందిన ప్రేమ్ గుప్తా తన కూతురితో సచిన్ కుమార్ అనే వ్యక్తికి ఇటీవల వివాహం అయింది. అతడికి ఇది తొలి వివాహం కాదని ఆ పెళ్లి తర్వాత తెలిసింది. అయినా సర్దుకుపోతున్న ఆమెను భర్త రోజు హింసిస్తుండటంతో ఇక విడిపోవడమే మేలని నిర్ణయించుకుంది. కూతురి నిర్ణయాన్ని అంగీకరించిన తండ్రి గుప్తా అల్లుడి నుండి విడిపోయిన ఆమెను తమ ఇంటి వరకూ బ్యాండు మేళం చప్పుళ్లతో తీసుకెళ్లాడు.









