హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ చేపట్టింది. ఆపరేషన్ అజయ్ కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ నుంచి నాలుగో విమానం ఢిల్లీకి చేరుకుంది. ఆ విమానంలో 274 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.
ఇప్పటికే మూడు విమానాల్లో భారతీయులు ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ నుంచి మూడో విమానంలో 197 మంది భారతీయులు ఢిల్లీకి సురక్షితంగా వచ్చారు. పాలస్తీనాలోని హమాస్ మిలిటింట్ గ్రూప్ ఇటీవల ఇజ్రాయెల్ పై మెరుపు దాడి చేసింది.
ఒకేసారి 5 వేల రాకెట్ లను ప్రయోగించింది. ఈ దాడితో ఇజ్రాయెల్ లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి ప్రతిదాడులకు దిగింది. ఈ యుద్ధం రెండు వైపులా వేలాది మంది ప్రాణాను బలి తీసుకుంది.









