కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆయన్ని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించామన్నారు. జనగామ సభలో చేరాలని చెప్పామన్నారు. కేసీఆర్ తో సమావేశమై తన నిర్ణయం చెబుతామన్నారు. పొన్నాల లక్ష్మయ్యను పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన కేకే, డీఎస్ లాంటి వాళ్లకు పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించామన్నారు.
అక్టోబర్ 16వ తేదీ జనగామలో జరిగే బీఆర్‌ఎస్ బహిరంగ సభ వేదికగా భారత రాష్ట్ర సమితీలో చేరబోతున్నారు. అయితే ఇప్పటికే జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కన్ఫామ్ అయినట్లుగా భావిస్తున్నప్పటికి పొన్నాల చేరికతో కేసీఆర్ నిర్ణయం మార్చుకొని బీసీ నేతకు టికెట్ ఇస్తారని తెలుస్తోంది.









