త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే, కామారెడ్డి నియోజక వర్గంలో పోటీ చేసి బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌పై విజయం సాధిస్తానని కార్మిక సంఘం నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ కానుగంటి రాజు(Doctor Kanuganti Raju) అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు చెందిన తనకు కాంగ్రెస్ పార్టీ, కార్మిక సంఘం నాయకుడిగా నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. ప్రజా, కార్మికుల సమస్యలపైన పోరాటం చేశానని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి కామారెడ్డి, సికింద్రాబాద్(Kamareddy, Secunderabad) అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్నానన్నారు.









